ఏకాంతంగా కోదండరాముడి బ్రహోత్సవాలు ?

ABN , First Publish Date - 2021-04-20T03:37:34+05:30 IST

బుచ్చి పెద్దూరులో కొలువైఉన్న కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు కరోనా సెకండ్‌వేవ్‌ షాక్‌ ఇవ్వనుంది. కరోనా పుణ్య

ఏకాంతంగా కోదండరాముడి బ్రహోత్సవాలు ?
విద్యుద్దీపాలంకరణతో ముస్తాబైన కోదండరాముడి ఆలయం, రాజగోపురం

 డోలాయమానంలో నిర్వాహకులు, భక్తులు

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్‌19 : బుచ్చి పెద్దూరులో కొలువైఉన్న  కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు కరోనా సెకండ్‌వేవ్‌ షాక్‌ ఇవ్వనుంది. కరోనా పుణ్యమా.. అంటూ గతేడాది బ్రహ్మోత్సవాలకు ఆటంకం కలిగింది.  ఈ ఏడాదైనా వైభవంగా జరుపుకోవాలని ఆలయ కార్యనిర్వాహకులు, స్థానిక పెద్దలు, భక్తులు ఎంతో ఆశతో ఎదురుచూశారు.ఈ నేపఽథ్యంలో  కరోనా వైరస్‌  విజృంభణతో  ప్రజారోగ్యం దృష్ట్యా నగర  పంచాయతీ కమిషనర్‌  బ్రహ్మోత్సవాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు సామూహికమా లేక ఏకాంతమా అన్న డోలాయమానంలో భక్తులు ఉన్నారు. 

ఈ విషయంపై నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు, సీఐ సురేష్‌బాబులను వివరణ కోరగా కరోనా విజృంభణ నేపధ్యంలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు. ఆలయ ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి వివరణ మేరకు బ్రహ్మోత్సవాలలో రఽథోత్సవం, తెప్పోత్సవం మినహా ఇతర సేవలు  ఆలయ సాంప్రదాయాల మేరకు నిర్వహిస్తామని తెలిపారు. 


Updated Date - 2021-04-20T03:37:34+05:30 IST