Jun 12 2021 @ 16:50PM

పవర్ స్టార్ సినిమాలో బ్రహ్మాజీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగు రీమేక్. ఇందులో కీలక పాత్రలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ కనిపించబోతున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్రహ్మాజీకీ సరైన గుర్తింపు దక్కే పాత్రలు రావడం లేదు. అయితే ఏకే తెలుగు రీమేక్‌లో రానా పాత్రకు ఓ డ్రైవర్ ఉండగా.. ఈ పాత్రనే బ్రహ్మాజీ పోషించనున్నట్లు సమాచారం. సినిమాలో బ్రహ్మాజీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఈ పాత్ర హైలెట్ అయితే మళ్ళీ ఫాంలోకి వస్తాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై  సూర్య‌‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు.