Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటినుంచి మత్సగిరీశుడి బ్రహ్మోత్సవాలు

కోరమీసాలు, నామాలతో శ్రీహరిదర్శనం 

 19వ తేదీ వరకు కార్యక్రమాలు 

వలిగొండ, నవంబరు 13: వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో మనోహరమైన, దివ్యమైన ఎత్తైన కొండపైన స్వయంభూ శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరాడు. భక్తులు కొలిచిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. ఈ పుణ్యక్షేత్రం మత్స్యాద్రిగా ది నదిన ప్రవర్థమానంగా విరాజిల్లుతోంది. పుష్కరిణిలో స్వామివారు నామాలు, కోరమాసాల్లో మత్స్యం(చేప) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఇక్క డి విశిష్టత. తీవ్ర కరువుకాలంలోనైనా పుష్కరిణిలోని తీర్థం ఎండిపోదు. ఈ కొలను తీర్థం సర్వరోగ నివారణ ప్రదాయనిగా పూజలందుకుంటుంది. నవంబరు 14 నుంచి 19వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించటా నికి ఆలయ ధర్మకర్తల పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఆలయ స్థల పురాణం 

శ్రీ మహావిష్ణువును దర్శించుకోవటానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం మునులు ఘోర తపస్సును ఆచరించగా వారి భక్తికి మెచ్చిన శ్రీహరి వారి కోరిక మేరకు మత్స్యావతారంలో వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారు సాలగ్రామ రూపంలో వెలిశారు. గుట్ట 3 ముఖాలుగా 3 గుం డాలుగా మారింది. స్వామివారి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహి స్తూ ఇక్కడి గుండాలు నిండిపోయినట్లు ఓ కథ వాడుకలో ఉంది. సాలగ్రామ రూపుడైన స్వామివారిని నూతన ధృవమూర్తి విగ్రహం ప్రతిష్టించి ప్రస్తుతం కొలుస్తున్నారు. మత్స్యగిరీశుడి సన్నిధికి చేరే మార్గంలో మేకల బం డ వద్ద రెండు ఘా ట్‌రోడ్లు గుట్టపైకి చేరే ప్రదేశంలో 42 ఫీట్ల ఎత్తుతో భారీ ఎత్తయిన అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. 

 ముస్తాబైన ఆలయం 

మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు ఘనంగా ముస్తాబు చేశారు. గుట్టపైన చలువ పందిర్లు కళ్లు మిరుమిట్లు గొలిపే రంగులు, ధగధగ మెరిసే విద్యుత దీపాలతో దేవాలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో తీర్చిదిద్దారు. నవంబరు 14 నుంచి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 14న ఆదివారం శ్రీ విష్ణుసహస్రనామ స్తో త్రపారాయణం, స్వస్తివాచనం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యహవచనము, అంకురార్పణ, గరుడ ధ్వజాధివాసం, నవంబరు 15న గరుడ ధ్వజప్రతిష్ఠ, పల్లకి, ధ్వజారోహణం, బలి ప్రదానం, బేరీ తాండవం, దేవతాహ్వానం హోమం, 16న చతుస్థానార్చన, హోమం, బలిప్రదానం, ఉత్సవమూర్తులకు స్నపనం, తీర్థప్రసాద గోష్ఠి, 17న ఉదయం 12.30 గంటలకు స్వామివారి క ల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 18న యాగశాల ద్వా ర తోరణార్చన, చతుస్థానార్చన, హోమం, ఉత్సవమూర్తులతో స్వపనము,  19న శుక్రవారం చక్రతీర్థం, దేవతోద్వాసనము, శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, ధ్వజావరోహణం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. 

 మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డికి ఆహ్వానపత్రికను శనివారం ఆలయ చైర్మన కిరణ్‌రెడ్డి, ఈవో రవికుమార్‌ అందజేశారు. Advertisement
Advertisement