అలాంటి గేమ్స్‌ మంచివేనా?

ABN , First Publish Date - 2020-06-13T06:02:29+05:30 IST

లుమాసిటీ వంటి అనేక బ్రెయిన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాములు గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోనూ లభిస్తున్నాయి. ఇవి ప్రధానంగా మెమొరీ, లాజిక్‌, ఏకాగ్రత వంటి అంశాల మీద దృష్టి సారించి కొన్ని గేమ్స్‌ అందిస్తూ ఉంటాయి...

అలాంటి గేమ్స్‌ మంచివేనా?

గూగుల్‌ ప్లే స్టోర్‌లో చాలా బ్రెయిన్‌ ట్రైనింగ్‌ గేమ్స్‌ లభిస్తున్నాయి. వాటిని పిల్లల చేత ఆడించడం వల్ల మెదడు చురుకుగా మారే అవకాశం ఏమైనా ఉంటుందా? 

- రాజేంద్ర కుమార్‌


లుమాసిటీ వంటి అనేక బ్రెయిన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాములు గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోనూ లభిస్తున్నాయి. ఇవి ప్రధానంగా మెమొరీ, లాజిక్‌, ఏకాగ్రత వంటి అంశాల మీద దృష్టి సారించి కొన్ని గేమ్స్‌ అందిస్తూ ఉంటాయి. అయితే వాటివల్ల ఆ గేమ్‌ మునుపటి కన్నా మరింత సమర్థవంగా ఆడే నైపుణ్యం లభిస్తుంది కానీ.. మెదడు ఆరోగ్యానికి ఏ మాత్రం ఉపయోగపడడం లేదని శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడయింది. దానికన్నా పుస్తక పఠనం, వివిధ రకాల నెమలి ఎక్సర్‌సైజ్‌లు, సుడోకు వంటివి ప్రయత్నించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి.


Updated Date - 2020-06-13T06:02:29+05:30 IST