పదేళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపిన ‘బ్రాండిక్స్‌’

ABN , First Publish Date - 2021-10-15T06:23:11+05:30 IST

దశాబ్ద కాలంగా సాగు తున్న సమస్యను బ్రాండిక్స్‌ భారత భాగస్వామి పరిష్కరించారు.

పదేళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపిన ‘బ్రాండిక్స్‌’
మత్స్యకారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న దొరస్వామి


  మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేసిన దొరస్వామి

అచ్యుతాపురం, అక్టోబరు 14 : దశాబ్ద కాలంగా సాగు తున్న సమస్యను బ్రాండిక్స్‌ భారత భాగస్వామి పరిష్కరించారు. బ్రాండిక్స్‌ నిర్మిస్తున్న సమయంలో కర్మాగారం నుంచి విడుదలైన శుద్ధి చేసిన వ్యర్థాలను పూడిమడక తీరంలో కలిపేందుకు 2011లో పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ వ్యర్థాలు సముద్రంలో కలిస్తే జలం కులుషితమై చేపలు చనిపోయి తాము జీవనోపాధి కోల్పోతామని పూడిమడక మత్స్యకారులు  ఆందోళనకు దిగారు. దీంతో బ్రాండిక్స్‌ యాజమాన్యం పూడిమడకలో రేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారంతో పాటు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అయితే తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ అప్పట్లో 16 మంది మత్స్యకారులు పరిహారం తీసుకోలేదు. నాటి నుంచి పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే దొరస్వామి మాత్రం ఎట్టకేలకు దీనిని పరిష్కరించారు. రూ.2.5లక్షలు యాజమాన్యం తరఫున పరిహారం ఇవ్వడంతో పాటు తన సొంత నిధుల నుంచి కుటుంబానికి అదనంగా రూ.20 వేలు  ఇస్తానని ఇటీవల ప్రకటించారు. ఆ మేరకు గురువారం చెక్కులను పంపిణీ చేశారు. పూడిమడక సర్పంచ్‌ చేపల సుహాసిని, మత్స్యకార నాయకులు చేపల వెంకటరమణ, వాసుపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:23:11+05:30 IST