బ్రెజిల్‌లో 5 లక్షలు దాటిన కరోనా మృతులు

ABN , First Publish Date - 2021-06-21T05:08:28+05:30 IST

కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇక్కడ ఇటీవలి కాలంలో కూడా విపరీతంగా కరోనా కేసులు నమోదయ్యాయి.

బ్రెజిల్‌లో 5 లక్షలు దాటిన కరోనా మృతులు

బ్రజీలియా: కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇక్కడ ఇటీవలి కాలంలో కూడా విపరీతంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గతవారం రోజలుగా ఈ దేశంలో సగటున రోజుకు 2వేల కరోనా మరణాలు నమోదవుతూ వచ్చాయి. దీంతో ఇక్కడి కరోనా మృతుల సంఖ్య 5లక్షలు దాటింది. బ్రెజిల్ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1.79కోట్లకు చేరగా, మరణాలు 5,00,800కు చేరినట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం కూడా దీనికి ఒక కారణంగా కనబడుతోంది. దేశ ప్రజల్లో కేవలం 11శాతం ప్రజలు మాత్రమే పూర్తిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు సమాచారం.

Updated Date - 2021-06-21T05:08:28+05:30 IST