ఎనిమిది పదుల పీలే
ABN , First Publish Date - 2020-10-24T09:26:33+05:30 IST
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే శుక్రవారం 81వ ఏట ప్రవేశించాడు. అయితే కొవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైన అతడు పుట్టినరోజును నిరాడంబరంగా
సావోపౌలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే శుక్రవారం 81వ ఏట ప్రవేశించాడు. అయితే కొవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైన అతడు పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకొన్నాడు. తనదైన శైలిలో ముసిముసి నవ్వులు చిందిస్తూ ఓ వీడియో సందేశంలో కనిపించాడు. ఇటీవలి కాలంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నా.. పీలే మోములో అలాంటి ఛాయలేవీ కనిపించకపోవడం విశేషం. అలాగే అతడిలో హాస్య చతురత కూడా చెక్కుచెదరలేదు. ‘ఫుట్‌బాల్ ఆడకపోవడం మినహా నేను చక్కగా ఉన్నా’ అని వీడియో సందేశంలో పీలే జోక్ చేశాడు. ఇక..ఫుట్‌బాల్ ప్రపంచం పీలేకి బర్త్‌డే విషెస్ చెప్పడంతోపాటు అతడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించింది.