బ్రెజిల్‌లో 28 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-05T21:52:40+05:30 IST

బ్రెజిల్‌ను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.

బ్రెజిల్‌లో 28 లక్షలు దాటిన కరోనా కేసులు

బ్రసిలియా: బ్రెజిల్‌ను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా 51,603 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 28,01,921కు చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో కరోనా కారణంగా 1,154 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 95,819కు చేరింది. బ్రెజిల్‌లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో జూలై 7న కరోనా బారిన పడగా.. రెండు వారాల తరువాత ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆయనకు నెగిటివ్ వచ్చిన కొద్ది రోజులకే ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక వీరితో పాటు మొత్తం ఏడుగురు మంత్రులకు ఇప్పటివరకు కరోనా పాజిటివ్ అని తేలింది. మరో ఇద్దరు మంత్రులు కరోనా పరీక్షలు చేయించుకోగా.. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అమెరికా అత్యధిక కేసులు, మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచింది.

Updated Date - 2020-08-05T21:52:40+05:30 IST