Jul 23 2021 @ 09:02AM

బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ 'ఇమ్మోర్టల్ అశ్వథ్థామ'కి మళ్లీ బ్రేక్..!

బాలీవుడ్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఇమ్మోర్టల్ అశ్వథ్థామ'. ఈమూవీకి మళ్లీ బ్రేక్ పడినట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహాభారత కాలం నాటి అశ్వథ్థామకు సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించనున్న ఈ మూవీకి ఆదిత్య దర్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్కీ కౌశల్ హీరోగా నటించబోతున్నాడు. 2021 ప్రారంభంలోనే మొదలవ్వాల్సిన చిత్ర షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోవ్ అవుతూ ఇప్పటివరకు సెట్స్ మీదకి రాలేదు. అయితే, ఇప్పుడు ప్రారంభించి కంటిన్యూ షెడ్యూల్ ప్లాన్ చేసిన ఈ మూవీ చిత్రీకరణకి మళ్ళీ బ్రేక్ పడిందట. యూరప్‌లో చిత్రబృందం షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ యూనిట్ సభ్యులలో కొందరికి వీసా సమస్య రావడంతో ఆగస్ట్ వరకు ఆగాల్సి వస్తుందని తాజా సమాచారం. అప్పటికి వీసా సమస్య తీరిపోతే ఆగస్ట్ తర్వాత 'ఇమ్మోర్టల్ అశ్వథ్థామ' షూటింగ్ ప్రారంభించనున్నారట.