పోలవరానికి అడుగడుగునా ఆటంకాలు...

ABN , First Publish Date - 2021-09-08T17:56:21+05:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి.

పోలవరానికి అడుగడుగునా ఆటంకాలు...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్రం వద్ద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసిన అనంతరం అనుమతులు వచ్చాయి. అయితే ఈ అనుమతులను ఎప్పటికప్పుడు కేంద్రం పొడిగిస్తూ వచ్చింది. టీడీపీ హయాంలో కేంద్ర పర్యావరణశాఖ ఒకసారి స్టాప్ వర్క్ ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పట్లో చంద్రబాబు కేంద్రపర్యావరణ శాఖ మంత్రి జవదేకర్‌తో మాట్లాడిన అనంతరం స్టాప్ వర్క్ ఆదేశాలను ఎత్తివేసింది. అప్పట్లో ఇచ్చిన ఈ ఆదేశాలు ఈ ఏడాది జులై మాసాంతంతో ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ స్టాప్ వర్క్‌కు సంబంధించిన అంశాన్ని జగన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని చెబుతున్నారు.

Updated Date - 2021-09-08T17:56:21+05:30 IST