Abn logo
Feb 2 2020 @ 19:23PM

బ్రెగ్జిట్ ఎఫెక్ట్... ఇంగ్లిష్ మాత్రమే మాట్లాడాలంటున్న నార్విచ్ పోస్టర్

v id="pastingspan1" style="font-family: Jyothi_ie, Jyothi; font-size: 23px; text-align: justify;">యూరోపియన్ యూనియన్ రిఫరెండం జరిగినప్పటి నుంచి బ్రిటన్‌లో జాత్యహంకార ధోరణి పెరుగుతోంది. తాము మాత్రమే గొప్పవారమనే భావాన్ని కొందరు ఆంగ్లేయులు ప్రకటిస్తున్నారు. అయితే ప్రజలు చైతన్యవంతం కావడంతోపాటు ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటం గమనార్హం.
 
తాజా సంఘటన తూర్పు ఇంగ్లండ్‌లోని నార్విచ్ పట్టణంలో జరిగింది. 95 ప్లాట్స్ ఉన్న ఓ నివాస సముదాయంలో ఓ పోస్టర్‌ను అతికించారు. ఈ ఫ్లాట్లలో నివసించేవారు ఇంగ్లిష్ మాత్రమే మాట్లాడాలని నిర్దేశించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటపడటం సంతోషకరమని పేర్కొన్నారు. మన దేశం మనకు తిరిగి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మాతృభాష కానివారు తాము ఉంటున్న ఫ్లాట్లను కౌన్సిల్‌కు అప్పగించాలని తెలిపారు.
ఈ ఫ్లాట్లను నిర్వహించే కౌన్సిల్ అంటించిన ఈ పోస్టర్‌పై  మండిపడిన ఓ మీడియా ప్రతినిథి దీనిని పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవడంతో ఆ పోస్టర్‌ను వెంటనే తొలగించారు. కానీ సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టర్ తిరుగుతోంది, విమర్శలపాలవుతోంది.
 
మీడియా ప్రతినిథి జేక్ హంఫ్రీ ఈ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ తనకు చాలా ఆగ్రహం తెప్పించిందని పేర్కొన్నారు. నార్విచ్ అత్యంత సహనశీలత కల, అందరినీ కలుపుకుపోయే ఆకర్షణీయ నగరమని పేర్కొన్నారు.
 
ఈ పోస్టర్ దేశాన్ని కానీ, నగరాన్ని కానీ ఏ విధంగానూ ప్రతిబింబించడం లేదన్నారు. జాత్యహంకార, ఛాందసవాద మైనారిటీలను ఎన్నటికీ సహించేది లేదని, వారు ఆధిపత్యం సాధించడానికి అవకాశం ఇవ్వబోమని తెలిపారు.
 
‘హ్యాపీ బ్రెగ్జిట్ డే’ అనే శీర్షికతో ఉన్న ఈ పోస్టర్‌లో ‘‘చివరికి మనం మన గొప్ప దేశాన్ని తిరిగి పొందినందువల్ల మన వింఛెస్టర్ టవర్ నివాసులకు ఓ నిబంధన గురించి స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. ఫ్లాట్లలో ఇంగ్లిష్ మినహా ఇతర భాషలు మాట్లాడేవారిని మనం సహించరాదు. మన స్వంత దేశం మనకు మళ్ళీ వచ్చింది. ఇక్కడ మాట్లాడే భాష క్వీన్స్ ఇంగ్లిష్’’ అని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మాతృభాష కానివారు తిరిగి తమ తమ దేశాలకు వెళ్ళిపోవాలని కూడా ఈ పోస్టర్‌లో ఉంది.
 
నార్విచ్ సిటీ కౌన్సిల్ కేబినెట్ మెంబర్ మైక్ స్టొనార్డ్ మాట్లాడుతూ ఈ పోస్టర్‌ను తీవ్రంగా ఖండించారు. దీనిని పెట్టినవారు తీవ్రమైన నేరానికి పాల్పడినట్లేనన్నారు.

TAGS: