Abn logo
Oct 24 2020 @ 05:42AM

బట్టీల కోసం ‘గంగ’కు అడ్డుకట్ట

చెరువులోకి నీరు చేరకుండా... 

ఆయకట్టు రైతుల ఆందోళన


బద్వేలు, అక్టోబరు 23:గంగనీటిని కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతుల ఆశలకు బట్టీల య జమా నులు గండికొడుతున్నారు. కొందరు ఇటుకల వ్యాపారులు చెరువులోకి గంగ నీరు చేరకుండా అడ్డుకున్న తీరు ఆయకట్టు రైతులను ఆందోళన కు గురిచేస్తోంది.  చెరువులను ఆక్ర మించుకుని బట్టీలు నిర్వ హించుకు నే వారు నీరువస్తే వ్యాపారాలు దెబ్బతింటాయనే కారణంగా గంగనీటిని అడ్డుకోవడంతో చెరువుకింద సాగుచేసే రైతులు అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చెరువులను సైతం దర్జాగా ఆక్రమించుకుని వ్యవసాయ పొలాలను ఇటుక బట్టీలుగా మా ర్చేస్తుండడంతో ఆయకట్టు రైతులకు నీరు అం దక తీవ్ర అవస్థలు పడుతున్నారు.


మండలంలోని  చింతలచెరువు, అబ్బుసాహెబ్‌పేట గ్రా మాలకు చెందిన చెరువు నీటిని రైతులకు అందకుండా ఇటుక బట్టీల యజమానులు తూములకు అడ్డంగా మట్టితోలి అడ్డుకట్ట వేయడంతో రైతులకు సాగునీరు అందక పం డించిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కొందరు ఇటుకల యజమానులు ఏకంగా చెరువునే ఆక్రమించుకుని   బట్టీలు  వేయడంతో చెరువులోకి నీరు  రాకుం డా తూములకు అడ్డుకట్ట వేశారని ప్రజలు వాపోతున్నారు. అనేక దఫా లు ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో చెరువు నీరు అందడం లేద ని ఆయకట్టు రైతు లు వాపోతున్నారు. అబ్బు సాహెబ్‌ పేట, బోయనపల్లె గ్రామాలకు ఉమ్మడి చెరువు  ఆక్రమణకు గురై సాగునీరు అందడంలేదన్నారు. ఇటీవల వర్షా లు కురిసి అన్ని చెరవుల ద్వారా నీరందుతు న్నా చింతల చెరువు నీటీని రైతులకు అందకుండా తూములను పూడ్చేయడంతో సాగునీ రు అందడంలేదని, అధికారులు స్పందించి  చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement