Viral Video: కల చెదిరింది.. కథ అడ్డం తిరిగింది.. పెళ్లి వేడుకలో ‘గాలిలో’ వధూవరుల అరుదైన ఫీట్.. ఆఖరి క్షణంలో..

ABN , First Publish Date - 2021-12-14T21:36:09+05:30 IST

జీవితంలో అతి ముఖ్యమైన వివాహ వేడుకను వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

Viral Video: కల చెదిరింది.. కథ అడ్డం తిరిగింది.. పెళ్లి వేడుకలో ‘గాలిలో’ వధూవరుల అరుదైన ఫీట్.. ఆఖరి క్షణంలో..

జీవితంలో అతి ముఖ్యమైన వివాహ వేడుకను వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అవసరమైతే అప్పులు చేసి మరీ పెళ్లి వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. ఇటీవలి కాలంలో ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రత్యేక ఏర్పాట్లతో పెళ్లి వేడుకలను జరిపిస్తున్నారు. సంగీత్ నుంచి పెళ్లి వేదిక, రిసెప్షన్ ఇలా అన్నింటినీ వినూత్నంగా తీర్చిదిద్దుతూ వివాహ వేడుకకు మెరుగులు దిద్దుతున్నారు. రాయ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఓ పెళ్లి వేడుకలో నిర్వాహకులు వినూత్నంగా చేసిన ఓ ప్రయోగం వికటించింది. 


పెళ్లి వేదిక మీద అందంగా అలంకరించిన ఊయలపై వధూవరులు కూర్చున్నారు. చుట్టూ డ్యాన్సర్లు చిందులేస్తుండగా, బాణాసంచా కాలుతుండగా ఊయల మెల్లగా పైకి లేచింది. పై వరకు వెళ్లాక ఉన్నట్టుండి ఊయలకు ఒకవైపు ఉన్న తాడు తెగిపోయింది. దీంతో 12 అడుగుల ఎత్తు నుంచి వధూవరులు కిందపడిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదంలో వధూవరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



Updated Date - 2021-12-14T21:36:09+05:30 IST