Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏవండీ.. ఒంట్లో బాలేదు ఆస్పత్రికి వెళ్లి వస్తా.. అని పెళ్లయిన ఏడో రోజే ఆడిగిందా భార్య.. కొద్దిగంటల్లోనే అసలు సంగతి తెలిసి ఆ భర్తకు మైండ్ బ్లాక్..!

జీవితంలో ఎంతో ముఖ్యమైన కార్యం పెళ్లి. మనిషి తన జీవితభాగస్వామిని పొందే శుభకార్యం పెళ్లి. అలాంటిది ఎంతో కష్టాల తరువాత ఒక యువకుడు పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన ఏడో రోజే భార్య కనపడకుండా పొయింది. ఆమె కోసం వెతుకుతున్న ఆ యువకుడి ఒక నిజం తెలిసింది. దాంతో అతను మనస్తాపం చెంది.. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలో జరిగింది.


రాజస్థాన్, హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాలలో పెళ్లికాని యువకుల సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. అక్కడ చాలా మంది యువకులు పెళ్లి చేసుకోవడానికి యువతుల కొరత ఉండడంతో దశారులపై 


ఆధారపడుతున్నారు. దళారులు యువకుల వద్ద డబ్బు తీసుకొని వారికి అమ్మాయిల సంబంధాలు చూసిపెడతారు. అలా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కి చెందిన బాబూరామ్ అనే వ్యక్తి తనకు 


పెళ్లికాకపోవడంతో తనకు పరిచయం ఉన్న జగ్మల్ సింగ్‌ అనే పెళ్లిళ్ల పేరయ్యను కలిశాడు. తన కోసం ఒక అందమైన అమ్మాయిని వెతికి పెట్టమని కోరాడు. అందుకు జగ్మల్ సింగ్ బాగా ఖర్చు అవుతుందని అన్నాడు. బాబు రామ్ అతను చెప్పినదానికి అంగీకరించాడు.


కొద్ది రోజుల తరువాత జగ్మల్ సింగ్ బాబూరామ్‌కు ఒక అమ్మాయి ఫొటో చూపించాడు. ఆ అమ్మాయి పేరు సునీత(పేరు మార్చబడినది) అని, వరుసకు తన మేనకోడలని, తల్లిదండ్రులెవరూ లేరని అంతా తానే అని జగ్మల్ సింగ్ చెప్పాడు. అమ్మాయి చాలా అందంగా ఉండడంతో బాబూరామ్ వెంటనే ఒప్పుకున్నాడు. సంబంధం కుదిర్చినందుకు జగ్మల్ సింగ్ ఫీజు రూ.6 లక్షలు. బాబూరామ్ జగ్మల్ సింగ్‌కు ఆ డబ్బు చెల్లించాడు. 


ఒక లాయర్ ఆధ్వర్యంలో పెద్దగా ఖర్చు లేకుండా ఆర్య సమాజ్‌లో బాబూరామ్, సునీతల పెళ్లి జరిగింది. పెళ్లైన రోజు నుంచి సునీత తనుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి భర్తకు దూరంగా ఉండేది. అలా ఒక వారం రోజుల తరువాత బాబూరామ్ ఇంటికి జగ్మల్ సింగ్ వచ్చాడు. సునీతకు ఆరోగ్యం సరిగా లేదని తెలిసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పగా.. బాబూరామ్ సరేనన్నాడు. అలా ఆస్పత్రికి వెళ్లిన జగ్మల్ సింగ్, సునీత ఎంతసేపటికీ తిరిగి రాలేదు. వారి ఫోన్లు కూడా పనిచేయడం లేదు. బాబూరామ్‌కు కంగారుపడి ఆస్పత్రికి వెళ్లి చూసాడు. అక్కడా వారిద్దరూ కనిపించలేదు. తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో ఉండాల్సిన నగలు, డబ్బు కనిపించడం లేదు.  వాటి విలువ సుమారు రూ.11 లక్షలు. బాబూరామ్‌కు ఏదో తేడా కొట్టింది. అతను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.


పోలీస్ స్టేషన్ వెళ్లగా.. అక్కడ తెలిసింది. తన లాగా చాలామంది యువకులు జగ్మల్ సింగ్ లాంటి దళారుల చేతిలో మోసపోయారని, కొత్తగా పెళ్లి కూతరు రూపంలో వచ్చేది దోపిడి దొంగ అని. ఇది విని బాబూరామ్ నమ్మలేక పోయాడు. ఈ సంఘటన అక్టోబర్ 26న జరిగింది. పోలీసులు నిందితుల కోసం విచారణ చేయగా.. జగ్మల్ సింగ్‌కు తోడుగా ఒక ముఠా పనిచేస్తోందని తెలిసింది.


పోలీసులు ఆ ముఠాలో ఆరుగురిని సోమవారం నవంబర్ 1న పట్టుకున్నారు. అందులో జగ్మల్ సింగ్ కూడా ఉన్నాడు. కానీ బాబూరామ్ భార్య సునీత ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. రాజస్థాన్‌లో బాబూరామ్ లాంటి అమాయక యువకులు చాలా మందిని నవవధువుల రూపంలో వచ్చి దోచుకుంటున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య అక్కడ బాగా పెరిగిపోయాయి. కానీ చాలా మంది యువకులు బయటికి చెబితే పరువుపోతుందని కేసు నమోదు చేయడం లేదు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement