Abn logo
Aug 25 2021 @ 19:14PM

పీటల మీద నుంచి పెళ్లి కూతురు పరార్

మదనపల్లె: పీటల మీద నుంచి పెళ్లి కూతురు పరారైంది. దీంతో పెళ్లి అర్థాతరంగా ఆగిపోయింది. అనంతపురం జిల్లా ఎన్.పి. కుంటకు చెందిన రామాంజనేయులుకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం బురుజుపల్లెకు చెందిన కుమారితో జులై 7న వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరికి ఈనెల 25న వివాహం జరగాల్సి వుంది. మదనపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో వివాహం ఏర్పాట్లు కూడా చేశారు. మంగళవారం రాత్రి పెళ్లి కూతురు కల్యాణ మండపానికి చేరుకుంది. ఈ తర్వాత ఉన్నట్టుండి పెళ్లి కూతురు కనపడకుండా పారిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కుమార్తె కనిపించకుండా పోవడంతో పెళ్లి కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి కూతురు మరో యువకుడితో వెళ్లిపోయిందని రామాంజనేయులు తెలిపాడు. నిశ్చితార్థం నుంచి ఇప్పటివరకు తమకు రూ. 2 లక్షల వరకు ఖర్చు అయిందని వరుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు పోలీసులు విచారణ చేస్తున్నారు.