Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతని పెళ్లి ఘనంగా జరిగింది.. భార్యతో కలిసి ఇంటికి వెళ్లాడు.. రెండు వారాల తర్వాత ఆమె చెప్పిన విషయం విని ఏం చేయాలో తెలియక..!

అతని వయసు 40 సంవత్సరాలు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరలేదు.. చివరకు ఓ మధ్యవర్తి సహాయంతో పెళ్లి కుదుర్చుకున్నాడు.. పెళ్లి కుదిర్చినందుకు ఆ మధ్యవర్తికి రూ.3 లక్షలు చెల్లించాడు.. గత నెల 27న వివావాం చేసుకున్నాడు.. రెండు వారాలు అంతా సవ్యంగానే ఉంది.. ఆ తర్వాత ఆమె తన సొంతూరికి వెళ్తానని చెప్పింది.. వద్దన్నా వినలేదు.. గట్టిగా నిలదీస్తే షాకింగ్ విషయం చెప్పింది.. తనకు అప్పటికే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. దీంతో అత్తింటి వారు అవాక్కయ్యారు. 


రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన ఉదేరామ్ అనే వ్యక్తి తన పెళ్లి కోసం కొడా బాయ్ అనే మధ్యవర్తిని సంప్రదించాడు. రూ.3 లక్షలు చెల్లించి పెళ్లి కుదుర్చుకున్నాడు. గత నెల 27న పంజాబ్‌కు చెందిన గీతా రాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రెండు వారాల వరకు గీత బాగానే ఉంది. ఆ తర్వాత పుట్టింటికి వెళ్తానంటూ గొడవ ప్రారంభించింది. తర్వాత వెళ్దామని భర్త చెప్పినా వినలేదు. దీంతో ఉదేరామ్‌కు అనుమానం వచ్చింది. ఆమెను గట్టిగా నిలదీస్తే అసలు విషయం చెప్పేసింది. 


తనకు ఎప్పుడో వివాహం జరిగిపోయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో ఉదేరామ్ కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. కొడా బాయ్ తనకు రూ.లక్ష ఇస్తాననడంతోనే ఈ పెళ్లికి అంగీకరించానని, పెళ్లి జరిగిన వారం తర్వాత ఇక్కడి నుంచి తనను తప్పిస్తానని కొడాబాయ్ చెప్పాడని రాధ చెప్పింది. దీంతో ఉదేరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధా రాణిని, కొడా బాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement