Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండ్రోజుల క్రితమే పెళ్లి.. భార్య నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి ఆ నవ వరుడు పక్క గదిలోకి వెళ్లి..

ఎన్నారై డెస్క్: కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రెండు రోజుల క్రితమే అతడు ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పుట్టింటిని వదిలి.. అతడితో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో నూతన దంపతుల కోసం అతడి కుటుంబ సభ్యులు.. మేడపై ఓ గదిని సిద్ధం చేశారు. నూతన వధూవరులు ఇద్దరూ ఆ గదిలో పడుకోగా.. మిగిలిన కుటుంబ కింద ఉన్న గదులలో పడుకున్నారు. ఈ నేపథ్యంలో భార్య నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి ఆ నవ వరుడు పక్క గదిలోకి వెళ్లాడు. అనంతరం అతడు అక్కడ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన విజయ్(23)కి కుటుంబ సభ్యులు మంజూ అనే అమ్మాయితో వివాహం చేశారు. ఈ క్రమంలో మంజూ అత్తారింట్లో అడుగుపెట్టింది. దీంతో ఆ నవదంపతుల కోసం విజయ్ కుటుంబ సభ్యులు.. మేడ మీద ఉన్న ఓ గదిని సిద్ధం చేశారు. బుధవారం రాత్రి తమకు కేటాయించిన రూంలోనే విజయ్, మంజూ పడుకోగా.. మిగిలిన కుటంబ సభ్యులు ఇతర గదులలో నిద్రపోయారు. ఈ నేపథ్యంలోనే మంజూతోపాటు ఇతర కుటుంబ సభ్యులు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత.. పక్క గదిలోకి వెళ్లిన విజయ్ ఓ షాకింగ్ పని చేసాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


కాగా.. అకస్మాత్తుగా నిద్రలోంచి మేల్కొన్న మంజూకు భర్త విజయ్ కనిపించకపోవడంతో ఆమె కంగారుపడి ఇల్లంతా వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో పక్క గదిలోనే విగత జీవిగా వేలాడుతున్న విజయ్‌ను చూసి, గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు.. విజయ్‌ను చూసి, శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ కుటంబ సభ్యులు మాట్లాడుతూ.. అతడి మానసిక స్థితి కొన్ని రోజులుగా సరిగ్గా లేదని అధికారులకు తెలిపారు. దీంతో విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement