బంపరాఫర్‌.. వరుడికి వేదిక పైనే ముద్దు పెట్టేసిన మరదలు!

ABN , First Publish Date - 2021-06-15T01:05:44+05:30 IST

కాబోయే బావని బావమరుదులు, మరదళ్లు పెళ్లి వేడుకలో ఏడిపించడం అనేది సాధారణ విషయమే

బంపరాఫర్‌.. వరుడికి వేదిక పైనే ముద్దు పెట్టేసిన మరదలు!

కాబోయే బావని బావమరుదులు, మరదళ్లు పెళ్లి వేడుకలో ఏడిపించడం అనేది సాధారణ విషయమే. ఎంతో సందడిగా జరిగే పెళ్లి వేడుకలో ఇలాంటి అల్లర్లు సరదాను పంచుతాయి. అయితే తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో వధువు సోదరి చేసిన పని వైరల్‌గా మారింది. పెళ్లి కుమార్తె సోదరి పెళ్లి మండపంలో అందరి ముందు వరుడికి ముద్దు పెట్టేసింది. ఈ హఠాత్పరిణామానికి వరుడు బిత్తరపోయాడు. 


ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను నిరంజన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొత్త దంపతులతో కలిసి ఫొటో దిగడానికి వచ్చిన వధువు చెల్లి.. వరుడి పక్కన కూర్చొని అతడికి గట్టిగా ముద్దు పెట్టేసింది. దీంతో వరుడు బిత్తరపోయి విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. అయినా కుదరలేదు. దీనిని చూసి అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. 



Updated Date - 2021-06-15T01:05:44+05:30 IST