Abn logo
Apr 2 2021 @ 10:42AM

ఆమె పెళ్లి దుస్తులు గిన్నీస్ బుక్ ఎక్కేశాయి!

ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ప్రత్యేకంగా జరగాలని కోరుకుంటారు. ఎంత వైభవంగా వీలైత అంత వైభవంగా వివాహం చేసుకోవాలని అనుకుంటారు. సైప్రస్‌కు చెందిన మరియా పరస్కేవా మాత్రం తన వివాహం ఏకంగా ప్రపంచ రికార్డుగా నిలవాలనుకుంది. అందుకే తన పెళ్లి కోసం ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకుంది. వివాహ సమయంలో ఆమె ధరించిన వీల్ (పాశ్చాత్య సాంప్రదాయంలో తలపై ధరించే వస్త్రం) పొడవు ఏకంగా 6962.6 మీటర్ల పొడవుంది. అంటే 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానం. 


వివాహం జరిగిన స్టేడియం మొత్తాన్ని ఆ వీల్ కప్పేసింది. ఆ వస్త్రాన్ని మైదానంలో అమర్చడానికి 30 మంది వలంటీర్లు 6 గంటల పాటు శ్రమించారు. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆమె సొంతమైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement