Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి : ఎస్పీ

కడప(క్రైం), డిసెంబరు 4 : జిల్లాలోని పోలీసు సిబ్బంది ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లాలోని సివిల్‌, ఏఆర్‌ పోలీసు సిబ్బందితో వారి సమస్యలు తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌ పరమైన సమస్యలైనా, వ్యక్తిగత, కుటుంబ లేదా సర్వీస్‌ సమస్యలైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీసు సిబ్బంది సమస్యలను ప్రతివారం తెలుసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement