Abn logo
Sep 26 2021 @ 23:11PM

టీడీపీకి పూర్వవైభవం తెస్తాం : లింగారెడ్డి

విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

కాశినాయన సెప్టెంబరు 26: నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి, టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అక్కంపేటలో నాగమల్లేశ్వర స్వామి(విభూది శివాలయం) 41 రో జుల పండుగను పురస్కరించుకుని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు బంగారు గుర్విరెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందన్నారు.  ప్రజాబలంతో గెలుపొందిన గోపవరం జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను వైసీపీ నేతలు పోలీసుల అండతో తమఖాతాలో వేసుకునేందుకు కోట్ల రూపాయలు ఎర చూపారంటే వారి నైజం ఎలాంటిదో ప్రజలు గుర్తించాలన్నారు. బద్వేలు ఉపఎన్నికపై రాష్ట్రమంతా ఎదురుచూస్తోందని ఈప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా టీడీపీ కి ఓటేసి గెలిపించాల ని కోరారు.

టీడీపీ యువనేత రితీ్‌షరెడ్డి, గోపవరం జడ్పీటీసీ జయరామిరెడ్డి, అట్లూరు టీడీపీ అధ్యక్షుడు మలికార్జున్‌, పోరుమామిళ్ల సర్పంచ్‌ యనమల సుధాకర్‌, బి.కోడూరు టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడి.్డ టీడీపీ రాష్ట్ర్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, కలసపాడు టీడీపీ నేత బాలిరెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.