టీకా తీసుకున్న పర్యటకులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్!

ABN , First Publish Date - 2022-01-26T02:38:18+05:30 IST

కరోనా టీకా తీసుకున్న పర్యటకులకు ‘తప్పనిసరి కరోనా పరీక్ష’ నిబంధనను తొలగిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం నాడు ప్రకటించారు.

టీకా తీసుకున్న పర్యటకులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రిటన్!

లండన్: కరోనా టీకా తీసుకున్న పర్యటకులకు ‘తప్పనిసరి కరోనా పరీక్ష’ నిబంధనను తొలగిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం నాడు ప్రకటించారు. ఈ మేరకు కరోనా నిబంధనల్లో మార్పులు చేశారు. ‘‘నెమ్మదించిన వ్యాపారకార్యకలాపాలను మళ్లీ పట్టాలెక్కించేందుకు, పర్యటకులను దేశంలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు బ్రిటన్ వచ్చాక మళ్లీ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరముండదు’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని ట్రాన్స్‌పోర్ట్ శాఖ సెక్రెటరీ షాప్స్ తెలిపారు. తప్పనిసరి కరోనా పరీక్షల అవసరం తీరిపోయిందని తెలిపిన ఆయన.. బ్రిటన్‌కు స్వేఛ్చనిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. కాగా.. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం పట్ల అక్కడి టూరిజం వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కరోనా ఆంక్షల ప్రభావం ఈ రంగంపైనే అధికంగా పడిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-26T02:38:18+05:30 IST