పదకొండు రోజులు నిద్రపోయిన బ్రిటన్‌

ABN , First Publish Date - 2020-09-27T17:12:21+05:30 IST

ప్రపంచమంతా ఉపయోగిస్తున్న క్యాలెండర్‌ను రూపొందించింది ఇటలీకి చెందిన జార్జ్‌గ్రెగరియన్‌. అందుకే ఈ క్యాలెండర్‌ను గ్రెగరియన్‌ క్యాలెండర్‌ అంటారు..

పదకొండు రోజులు నిద్రపోయిన బ్రిటన్‌

క్యాలెండర్లో రెండో తేదీ తరవాత మూడో తేదీ వస్తుంది. కానీ ఓసారి బ్రిటన్‌లో రెండో తేదీ తరువాత 14వ తేదీ వచ్చింది తెలుసా? 


ప్రపంచమంతా ఉపయోగిస్తున్న క్యాలెండర్‌ను రూపొందించింది ఇటలీకి చెందిన జార్జ్‌గ్రెగరియన్‌. అందుకే ఈ క్యాలెండర్‌ను గ్రెగరియన్‌ క్యాలెండర్‌ అంటారు. దీన్ని ప్రపంచానికి 1582 అక్టోబర్‌లో పరిచయం చేశాడు గ్రెగరియన్‌. అంతకు ముందు వరకు ప్రపంచ దేశాలన్నీ జూలియస్‌ సీజర్‌ రూపొందించిన క్యాలెండర్‌ను అనుసరించేవారు. క్రీస్తు పూర్వం 46లో సీజర్‌ ఏడాదికి 365 రోజుల 6 గంటలుగా లెక్కగట్టి క్యాలెండర్‌ను రూపొందించాడు. కానీ సూర్యుడి గమనాన్ని బట్టి లెక్క పెడితే ఏడాదికి 365 రోజుల 5 గంటల 49 నిమిషాలు మాత్రమే. దీంతో ఏడాదికి పదకొండు నిమిషాల అంతరం ఏర్పడుతూ వచ్చింది. ఆ లోపాన్ని సరిచేసి గ్రెగరియన్‌ కొత్త క్యాలెండర్‌ను రూపొందించాడు. ప్రపంచదేశాలు గ్రెగరియన్‌ క్యాలెండర్‌ ను అనుసరించడం మొదలుపెట్టాయి. 

బ్రిటన్‌ అధిపతులు గ్రెగరియన్‌ క్యాలెండర్‌ను అనుసరించేందుకు నిరాకరించారు. దీంతో ఏళ్లు గడిచేకొద్దీ మిగతా దేశాలతో తేదీల విషయంలో బ్రిటన్‌కు తేడాలొచ్చాయి. పదకొండు రోజులు తేడా రావడంతో బ్రిటన్‌ కూడా గ్రెగరియన్‌ క్యాలెండర్‌ అనుసరించాలని నిర్ణయించింది. 1752 సెప్టెంబర్‌ 2 రాత్రి బ్రిటన్‌ ప్రజలు నిద్రపోయారు. మరుసటి రోజు లేచేసరికి తేదీ సెప్టెంబర్‌ 14కు మారిపోయింది. మధ్యలో పదకొండు రోజులను తొలగించింది బ్రిటన్‌. అలా ప్రపంచదేశాలతో సమానమైన తేదీకి వచ్చేసింది. అలా 11 రోజులను కోల్పోయారు బ్రిటన్‌ ప్రజలు. 

Updated Date - 2020-09-27T17:12:21+05:30 IST