ఆగస్ట్ నాటికి కరోనా ఫ్రీ దేశంగా బ్రిటన్!

ABN , First Publish Date - 2021-05-09T06:29:15+05:30 IST

కరోనా వల్ల అతి భయానక పరిస్థితులను ఎదుర్కొన్న దేశాల జాబితాలో బ్రిటన్ కూడా ఉంది. అయితే 2020 ఆగస్ట్ నాటికి బ్రిటన్‌లో కరోనా ఖతం అవుతుందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఆగస్ట్ నాటికి బ్రిటన్

ఆగస్ట్ నాటికి కరోనా ఫ్రీ దేశంగా బ్రిటన్!

లండన్: కరోనా వల్ల అతి భయానక పరిస్థితులను ఎదుర్కొన్న దేశాల జాబితాలో బ్రిటన్ కూడా ఉంది. అయితే 2020 ఆగస్ట్ నాటికి బ్రిటన్‌లో కరోనా ఖతం అవుతుందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఆగస్ట్ నాటికి బ్రిటన్ కరోనా ఫ్రీ కంట్రీగా మారుతుందని ఆ దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ క్లైవ్ డిక్స్ ఓ ఇంటర్యూలో చెప్పారు. అంతేకాకుండా 2022 ప్రారంభంలో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాం‌ను బ్రిటన్ చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరి శరీరాల్లో యాంటీబాడీలు ఒకేలా పని చేయవన్నారు. అలాంటి వారి కోసం బూస్టర్ షాట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోందని తెలిపారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల మంది ప్రజలు టీకాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. జూలై చివరి నాటికి బ్రిటన్ ప్రజలందరికీ మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. 


Updated Date - 2021-05-09T06:29:15+05:30 IST