Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన బ్రిటన్

లండన్: భారత ప్రయాణికులకు బ్రిటన్ తీపి కబురు చెప్పింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయులను యూకేలో ప్రవేశానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 22 నుంచి కోవాగ్జిన్ తీసుకున్న ప్రయాణికులు బ్రిటన్ రావొచ్చని వెల్లడించింది. ఇలా కోవాగ్జిన్ తీసుకున్నవారికి ఇంగ్లండ్ వచ్చిన తర్వాత సెల్ఫ్ క్వారంటైన్ కూడా ఉండదని ప్రకటించింది. ఇటీవల కోవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు లభించిన నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గత నెలలలో కోవిషీల్డ్ పేరిట భారత్‌లో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన ఆక్స్‌ఫర్డ్-అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు సైతం యూకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు టీకాలు తీసుకున్న భారతీయులకు ఇప్పుడు బ్రిటన్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. 

కోవాగ్జిన్‌కు బ్రిటన్ ఆమోదించిన సందర్భంగా భారత్‌లోని బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. "బ్రిటన్ వెళ్లాలనుకునే భారత ప్రయాణికులు గుడ్ న్యూస్. నవంబర్ 22 నుంచి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదించిన కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు యూకే వెళ్లొచ్చు. వారికి ఎలాంటి సెల్ఫ్ ఐసోలేషన్ ఉండదు. కనుక కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్ తీసుకున్న ప్రయాణికులు కూడా ఇంగ్లండ్ వెళ్లొచ్చు." అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, నవంబర్ 22 తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుంది. 


అలాగే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న విదేశీయులకు ప్రయాణ మార్గదర్శకాలు మరింత సులువు చేసింది బ్రిటన్. ఇకపై ప్రయాణికులకు జర్నీకి ముందు కరోనా పరీక్ష అవసరం లేదు. దీంతోపాటు యూకే వెళ్లిన తర్వాత 8వ రోజు కూడా టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అక్కిడి వెళ్లిన తర్వాత సెల్ఫ్ ఐసోలేషన్ కూడా అక్కర్లేదు. అటు 18ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. అయితే, ప్రయాణానికి ముందు పీసీఆర్ టెస్టు చేయించుకుని దాని తాలూకు నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది.   

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement