బ్రిటన్‌లో 50ఏళ్లు నిండిన వారికి కొవిడ్ టీకా మూడో డోసు

ABN , First Publish Date - 2021-05-05T13:32:05+05:30 IST

కొవిడ్ నివారణకు వీలుగా బ్రిటన్ దేశంలో మూడో డోసు టీకాలు వేయాలని తాజాగా నిర్ణయించారు....

బ్రిటన్‌లో 50ఏళ్లు నిండిన వారికి కొవిడ్ టీకా మూడో డోసు

లండన్ : కొవిడ్ నివారణకు వీలుగా బ్రిటన్ దేశంలో మూడో డోసు టీకాలు వేయాలని తాజాగా నిర్ణయించారు. బ్రిటన్ దేశంలో క్రిస్మస్ పండుగ నాటికి 50 ఏళ్ల పైబడిన ప్రతీ ఒక్కరికీ  మూడవ కొవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమాన్ని ఇంగ్లాండు దేశ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి పర్యవేక్షిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మొదటి టీకా కొత్త వేరియంట్లను పరిష్కరించడానికి ప్రత్యేకంగా సవరించిన టీకాను వేశారు. రెండవ టీకా ఇప్పటికే వాడుకలో ఉన్న మూడు వెర్షన్లలోది. మూడవ కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఫైజర్ -బయోఎంటెక్, ఆక్స్ పర్డ్ -అస్ట్రాజెనెకా లేదా మోడెర్నా టీకాలు వేయాలని నిర్ణయించారు. 


బ్రిటన్ దేశంలో 34.6 మిలియన్లకు పైగా ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్లు మొదటి మోతాదు ఇచ్చారని ఆ దేశ గణాంకాలు చెబుతున్నాయి. 67 మిలియన్ల జనాభా ఉన్న బ్రిటన్ దేశంలో 510 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులకు పైగా వేసేందుకు సర్కారు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ 60 మిలియన్ల మోతాదులను బ్రిటన్ కొలుగోలు చేస్తుందని బ్రిటన్ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ గత వారం చెప్పారు.బ్రిటన్ దేశంలో 100 మిలియన్ మోతాదుల ఫైజర్ వ్యాక్సిన్ ను బ్రిటన్ ఇప్పటికే ఆర్డరు చేసింది.

Updated Date - 2021-05-05T13:32:05+05:30 IST