36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయనున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్?

ABN , First Publish Date - 2020-04-02T20:57:15+05:30 IST

బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా

36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయనున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్?

లండన్: బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్స్, హెడ్ ఆఫీస్ తదితర విభాగాలో పనిచేస్తున్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని యునైట్ యూనియన్‌తో బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఒప్పందం చేసుకుంది. 36 వేల మంది ఉద్యోగులంటే మొత్తంగా 80 శాతం మంది ఉద్యోగులపై పిడుగు పడిననున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. యునైట్ యూనియన్‌తో చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందినది. గాత్విక్ ఎయిర్‌పోర్ట్ నుంచి తాత్కాలికంగా విమానాలను నిలిపివేస్తున్నట్టు బ్రిటిష్ ఎయిర్‌వేస్ మంగళవారం ప్రకటించింది. బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులలో గాత్విక్ ఎయిర్ పోర్ట్ కూడా ఒకటి. కరోనా నేపథ్యంలో ఈ ఎయిర్‌పోర్ట్‌లు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.  

Updated Date - 2020-04-02T20:57:15+05:30 IST