జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని అపహాస్యం చేస్తూ.. బ్రిటిష్ యువకులు..

ABN , First Publish Date - 2020-06-02T00:08:39+05:30 IST

బ్రిటన్‌కు చెందిన ఇద్దరు యువకులు నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని

జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని అపహాస్యం చేస్తూ.. బ్రిటిష్ యువకులు..

లండన్: బ్రిటన్‌కు చెందిన ఇద్దరు యువకులు నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని అపహాస్యం చేస్తూ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని మిన్నెపొలిస్‌లో తెల్ల పోలీసు కారణంగా నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జార్జ్ ఫ్లాయిడ్ అంశం అమెరికాను అట్టుడికిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిరసనలే కనపడుతున్నాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పైనున్న ఫొటోను గమనిస్తే.. ఇద్దరు బ్రిటిష్ యువకులు నవ్వుతూ ఫొటోకు స్టిల్ ఇవ్వడం కనిపిస్తుంది. సరిగ్గా జార్జ్ ఫ్లాయిడ్ తెల్ల పోలీసు అధికారి చేతిలో ఏ విధంగా అయితే మరణించాడో.. అదే విధంగా ఫోజిస్తూ ఇద్దరు బ్రిటిషర్లు జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని అపహాస్యం చేశారు. స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోను వార్విక్ యూనివర్శిటి ఫేస్‌బుక్ పేజీలో మరలా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. దీంతో యూనివర్శిటి యాజమాన్యం దీనిపై స్పందించింది. ఫొటోలో ఉన్న వ్యక్తులు తమ యూనివర్శిటీకి చెందిన వారు కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలను తాము స్వాగతించమని.. తమ యూనివర్శిటీ పాటిస్తున్న సూత్రాలకు ఇలాంటి చర్యలు వ్యతిరేకమని యూనివర్శిటి అధికారులు తెలిపారు. కాగా.. ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరి యువకుల వయసు 18,19 సంవత్సరాలని.. యువకులిద్దరూ ప్రాంక్స్ చేస్తుంటారని స్నేహితులు చెబుతున్నారు.   

Updated Date - 2020-06-02T00:08:39+05:30 IST