Abn logo
Sep 20 2021 @ 19:12PM

కృత్రిమ గర్భానికి ప్రైవేటు క్లినిక్స్‌లో ఖర్చు ఎక్కువ అవుతుందని.. వీర్యదానం చేసే వ్యక్తిని నేరుగా ఇంటికి రప్పించి..

ఇంటర్నెట్ డెస్క్: మొదటి భర్తతో కలహాలు భరించలేక అతడికి దూరమైంది. అప్పటికే ఆమెకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. దీంతో.. మొదటి బిడ్డకు తోడుగా రెండో సంతానం కావాలని కోరుకుంది. అయితే..మరో వ్యక్తికి దగ్గరయ్యే బదులు..కృత్రిమ గర్భధారణ ద్వారా సంతానాన్ని పొందేందుకే ఆమె మొగ్గుచూపింది. ఈ క్రమంలో తీసుకున్న ఓ నిర్ణయం ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. బ్రిటన్‌కు చెందిన స్టెఫానీ టేలర్ ఉదంతం ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. 

స్టెఫానీ టేలర్‌కు 33 ఏళ్లు. భాగస్వామితో గొడవల కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. అయితే..అతడు ఇలా ఒంటరిగా పెరగడం ఆమెకు ఇష్టం లేదు. దీని వల్ల అతడి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆమె భయపడింది. అలాగని ఇష్టం లేని వ్యక్తితో కలిసుండటం కూడా ఆమెకు నచ్చలేదు. దీంతో.. కృత్రిమగర్భదారణ ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకుంది. కానీ.. ప్రైవేటు క్లినిక్ వారు చెప్పిన రేట్లు విని ఆమెకు దిమ్మతిరిగింది. ఇందుకోసం ఏకంగా 1600 పౌండ్లు ఖర్చు అవుతుందని(మన కరెన్సీలో ఇది రూ 1.6 లక్షలు) తెలియడంతో నిరాశ చెందిన ఆమె చివరికి పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. 

ఇవీ చదవండి:

కళ్లముందే రూ.1448 కోట్లు కనిపిస్తున్నా వాడుకోలేని పరిస్థితి..  ఓ వృద్ధుడికి వింత కష్టం.. 

మగాళ్లు కలలో కూడా ఊహించలేని కండీషన్లను భర్తకు పెట్టిందో భార్య..


ఈ క్రమంలో ఆమె మొదట యూట్యూబ్‌, ఇంటర్నెట్ ద్వారా కృత్రిమ గర్భధారణ పద్ధతిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఆ తరువాత.. ఓ యాప్ ద్వారా వీర్యదాతను సంప్రదించింది. అతడు నేరుగా ఆమె ఇంటికి వచ్చి వీర్యాన్ని ఇచ్చి వెళ్లాడు. మరోవైపు.. ఈబే(eBay)లో కృత్రిమగర్భధారణ కిట్‌ను కొనుగోలు చేసింది.  అనంతరం..యూట్యూబ్‌లో చూపించిన విధంగా కృత్రిమ గర్భధారణ ప్రక్రియను పూర్తి చేసింది. ఫలితంగా.. ఆమె గతేడాది అక్టోబర్‌లో ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఈడెన్‌ అని పేరుపెట్టుకుంది. అయితే.. స్టెఫానీ నిర్ణయంతో ఆమె తల్లి, సోదరి పూర్తిగా ఏకీభవించినప్పటికీ.. తండ్రి మాత్రం తొలుత ఆమోదించలేకపోయారు. కొంత కాలం తరువాత తన మనసు మార్చుని కూతురికి మద్దతుగా నిలిచారు. 

ఇక..ఆధునిక సాంకేతికత అందుబాటులో లేకపోతే ఇందంతా సాధ్యమయ్యేది కాదని స్టెఫానీ చెప్పింది. తన కూతురు అసలు సిసలైన ‘ఆన్‌లైన్ చిన్నారి’(eBaby) అంటూ సంబరపడిపోయింది స్టెఫానీ. వీర్యదాత మాత్రం తన వివరాలు గోప్యంగానే ఉండాలని కోరుకుంటున్నాడు. స్టెఫానీ కోరుకుంటే మాత్రం మరోసారి వీర్యదానం చేసేందుకు తాను సిద్ధమని చెప్పాడు. ఈడెన్‌ భవిష్యత్తులో తన ‘జన్యుదాత’ను కలవాలనుకంటే తనకు ఎటువంటి అభ్యంతరం ఉండదని కూడా స్టెఫానీ చెప్పింది.

ప్రత్యేకంమరిన్ని...