Abn logo
Feb 23 2020 @ 00:56AM

టెక్నాలజీ పట్టండి లాభాలు పొందండి

ప్రస్తుతం ఆర్థికంగా స్వయం సమృద్ధంగా ఉండడం మీదనే అందరి దృష్టి ఉంది. తక్కువ సమయంలోనే అధిక రాబడులు పొందడంపై అందరి దృష్టి ఉంది. ఇందుకు దీటుగానే వారికి సరైన ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాలు అందించేందుకు కొత్త తరం బ్రోకరేజీ కంపెనీలు కూడా పుట్టుకువచ్చాయి. ఈ బ్రోకరేజీ కంపెనీలు వారికి చక్కని మార్గదర్శకం చేస్తున్నాయి.


ఇప్పుడు మిలీనియల్స్‌ (40 సంవత్సరాల వయో పరిమితిలోని వారు), జెన్‌ జడ్‌ (యు వత) ఎక్కువగా అధిక రాబడి పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. దేశంలో ప్రజల పెట్టుబడి ధోరణులపై యుగవ్‌-మింట్‌ మిలీనియల్‌ సర్వే లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పాత తరాలతో ప్రధానంగా ఇప్పుడు రిటైర్మెంట్‌ వయసుకు చేరిన తరంతో పోల్చితే మిలీనియ ల్స్‌ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. అలాగే విద్యాభ్యాసం ముగించుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత కూడా పెట్టుబడుల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగ జీవితంలో ప్రవేశించిన రోజుల్లో విలాసవంతమైన జీవితాలు, వ్యక్తిగత సౌకర్యాన్ని పెంచే ఉపకరణాలపై అధికంగా దృష్టి ఉన్నప్పటికీ  సమాంతరంగా వారు భవిష్యత్తులో ఆర్థికంగా స్వయం సమృద్ధంగా నిలవడంపై దృష్టి సారిస్తున్నారు. 


అధికంగా ఈక్విటీ అనుసంధానిత పొదుపు పథకాల్లో సొమ్ము పెడుతున్నారు. నేరుగా ఈక్విటీ మార్కెట్లో ప్రవేశించాలంటే ఆ మార్కెట్లపై పూర్తి అవగాహన, వాటిలో ఉండే ఆటుపోట్లు, సంక్లిష్ట సమయాల్లో నష్టాల పాలు కాకుండా తక్షణం బయటపడడం గురించి అవగాహన కావాలి. కాని ఆధునిక తరం బ్రోకరేజీ సంస్థలు ఇలాంటి శ్రమ వారికి తప్పిస్తున్నాయి. సకాలంలో సరైన సలహాలు అందిస్తూ ఇన్వెస్టర్లకు అండగా నిలుస్తున్నాయి. దీనివల్ల బ్రోకరేజీల ఫీజు భారం ఉన్నా కూడా పెట్టుబడులపై వస్తున్న రాబడులు ఆ భారం తెలియకుండా చేస్తున్నాయి.


ఈక్విటీల పైనే ఆసక్తి ఎందుకు?

ప్రజల్లో ఈక్విటీలపై ఆసక్తి పెరగడానికి కార ణం ఏమిటనేది తెలుసుకోవాలి. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా పాత తరం నుంచి ప్రత్యేక గుర్తింపు ఉన్న బ్యాంకు ఎఫ్‌డీలు అందిస్తున్న సగటు వార్షిక రాబడి 4 నుంచి 7 శాతం ఉంటుం ది. కాని గత ఏడాది కాలంలో స్టాక్‌ మార్కెట్‌ తీవ్రమైన ఆటుపోట్లు చవిచూస్తున్న రోజులనే పరిగణనలోకి తీసుకున్నా ఈక్విటీలు అందించిన సగటు రాబడి 15 శాతం ఉంది. అంటే మన జీడీపీ కన్నా రెండు రెట్లు అధికంగా రాబడులు అందుతున్నాయన్న మాట. ఇక డే ట్రేడర్ల వంటి వారిని పరిగణనలోకి తీసుకుంటే సరైన పరిజ్ఞానంతో పావులు కదిపే వారు భారీ లాభాలే మూటగట్టుకుంటున్నారు. అందుకే ప్రజల్లో ఈక్విటీలపై ఆసక్తి పెరిగింది. 


బ్రోకరేజీలు ఎందుకు? 

మార్కెట్‌ కదలికలపై సంపూర్ణమైన అవగాహన ఉండి వాటికి దీటుగా క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే నిపుణులతో పోల్చితే చిన్న ఇన్వెస్టర్లకు ఆ అవగాహన, పరిజ్ఞానం తక్కువగా ఉంటాయి. అలాంటి వారికి బ్రోకరేజీలు రిస్క్‌ లేకుండా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడంపై చక్కని మార్గదర్శకం చేస్తున్నాయి. టెక్నాలజీ వెల్లువలో ఎగిసి పడుతున్న కొత్త తరానికి ఆ తరహా టెక్నాలజీ ఉత్పత్తులనే అందిస్తున్నాయి. బ్రోకరేజీ కంపెనీలకు కృత్రిమ, మేథ, బిగ్‌ డేటా అందుబాటులో ఉంటాయి.


వాటిని ఉపయోగించుకుని కొత్తతరం బ్రోకరేజీలు అందిస్తున్న మార్గదర్శకంతో కూడిన రెడీమేడ్‌ ఉత్పత్తుల పనితీరును ఇన్వెస్టర్లు ఇంటిలో లేదా కార్యాలయంలో కూర్చుని మొబైల్‌ హ్యాండ్‌సెట్లు, డెస్క్‌టా్‌పల ద్వారా ట్రాక్‌ చేసుకోగలుగుతున్నారు. ఈ టెక్నాలజీల వల్ల మార్కెట్లో ఆకస్మికంగా ఏర్పడే ఊర్థ్వముఖ, అథోముఖ కదలికలను ట్రేడర్లతో పోల్చితే సగటు ఇన్వెస్టర్లు సత్వరం గుర్తించగలుగుతున్నారు. ఆ రకంగా బ్రోకరేజీల సహాయంతో ఇన్వెస్టర్లు చక్కటి అవగాహనతోనే నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులపై మెరుగైన రాబడులు రాబట్టుకోగలుగుతున్నారు. 


టెక్నాలజీలు చేతివేళ్లపై ఉండే యువతరం కొత్త తరం ఇన్వె్‌స్టమెంట్లపై ఆసక్తి చూపడం వల్ల మరింత మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్లో నమో దవుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎ్‌సఈలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య గత పదేళ్ల కాలంలో 11 శాతం సగటు వృద్ధితో 2.78 కోట్లకు చేరితే వారిలో రిటైల్‌ ఇన్వెస్టర్లు 97.5 శాతం మంది ఉన్నారు. బీఎ్‌సఈలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 4.58 కోట్లు (26 శాతం వార్షిక వృద్ధి). యువత భారీ సంఖ్యలో ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశించడమే ఈ అద్భుతమైన వృద్ధికి కారణం.


Advertisement
Advertisement
Advertisement