సింధు విజయం దేశానికి గర్వకారణం

ABN , First Publish Date - 2021-08-02T08:48:18+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో

సింధు విజయం దేశానికి గర్వకారణం

అభినందనలు తెలిపిన గవర్నర్‌, సీఎం జగన్‌, చంద్రబాబు



అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. సింధు సాధించిన ఘనత దేశానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచ క్రీడాపటంలో భారత్‌ పేరు నిలబెట్టిన సింధు తెలుగు బిడ్డ కావడం గర్వకారణమన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సింధుకు అభినందనలు తెలిపారు.


రెండు ‘పతకాలను’ సాధించిన తొలి భారత మహిళ: పాతూరి

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పోటీలలో రెండు పతకాలను సాధించిన తొలి భారత మహిళ పీవీ సింధు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు జడ్పీ మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం ఒక ప్రకటనలో అభినందించారు.

Updated Date - 2021-08-02T08:48:18+05:30 IST