క్వారంటైన్ డేటింగ్.. ఈ ఫొటోగ్రాఫర్ ఐడియాకు నెటిజన్లు ఫిదా

ABN , First Publish Date - 2020-03-31T02:53:30+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. నిత్యం రోడ్లపై తిరుగుతూ ఉండే యువత కూడా

క్వారంటైన్ డేటింగ్.. ఈ ఫొటోగ్రాఫర్ ఐడియాకు నెటిజన్లు ఫిదా

బ్రూక్లిన్: కరోనా మహమ్మారి కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. నిత్యం రోడ్లపై తిరుగుతూ ఉండే యువత కూడా ఒకేసారి ఇంటికి పరిమితమవ్వాల్సి వచ్చింది. చాలా మంది యువత కరోనా కారణంగా తమ మనసుకు నచ్చిన వారిని కూడా చూడలేకపోతున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్ ఒక విధంగా వీరిని ఇబ్బందులకు గురిచేస్తోందనే చెప్పుకోవాలి. 


మరికొంతమంది మాత్రం సెల్ఫ్ ఐసోలేషన్‌ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అమెరికాలోని బ్రూక్లిన్‌కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ మాత్రం తనకు సెల్ఫ్ ఐసోలేషన్ బాగా కలిసొచ్చిందని చెబుతున్నాడు. కారణమేంటంటే.. జెరెమి కొహెన్ అనే ఫొటోగ్రాఫర్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూనే ఓ అమ్మాయిని పడేశాడు. ఏ సోషల్ మీడియా ద్వారానో పరిచయం చేసుకుని ఉంటాడులే అని అనుకుంటే పొరపాటే. 


తన ఇంటి ఎదురుగా కనిపించే బిల్డంగ్‌పై టోరీ అనే యువతిని మొదటిసారిగా చూశానని.. డ్రోన్ ద్వారా తన ఫోన్ నెంబర్‌ను ఆమెకు పంపించానని జెరెమి వివరించాడు. జెరెమి ఐడియాకు టోరీ ఫిదా అవడంతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం డేటింగ్ వరకు వెళ్లింది. జెరెమి ఇంటి బాల్కనీలో ఒకసారి.. టోరీ ఇంటిపై ఒకసారి తామిద్దరం కలిసి డిన్నర్ చేసినట్టు జెరెమి చెప్పుకొచ్చాడు. 


వీరి మధ్య బంధం మరింత పెరిగినట్టు.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా.. జెరెమి టోరీని ప్రేమలో ఎలా పడేసింది మొత్తం వీడియోల రూపంలో టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తూ వచ్చాడు. జెరెమి పోస్ట్ చేసిన వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ కామెంట్ పెడుతున్నారు. 

Updated Date - 2020-03-31T02:53:30+05:30 IST