Advertisement
Advertisement
Abn logo
Advertisement

హుక్కా దుకాణం తాళం ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన మరిది.. వదిన దగ్గరకు వెళ్లి ఏం చేశాడంటే..

హరియాణాలోని బడాగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. హుక్కా దుకాణం తాళం ఇవ్వలేదని ఆగ్రహించిన ఒక యువకుడు తన వదినపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ మహిళతో పాటు ఆమె కుమారుడు తృటిలో తప్పించుకున్నారు. ఈ నేపధ్యంలో బాధితురాలు నిందితుడు నురేంద్రపై కుంజ్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనికి ముందు నిందితునిపై అక్రమంగా ఆయుధాలు కలిగివున్నాడన్న కేసు కూడా నమోదయ్యింది. బాధితురాలు లలిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం లలిత ప్రేమ వివాహం చేసుకుంది. 

డిసెంబరు 4న రాత్రి తన భర్త, మరిది సురేంద్ర, మామ రమేష్ చంద్రల మధ్య ఏదో విషయమై గొడవ జరిగిందన్నారు. తరువాత వారంతా ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పడుకున్నారు. అయితే లలిత మరిది, అతని భార్య ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయారు. మర్నాటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన మరిది గొడవ ప్రారంభించాడు. వారికి ఉన్న హుక్కా దుకాణం తాళాలు ఇవ్వాలంటూ వదినపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే బాధితురాలు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement