Abn logo
Mar 27 2020 @ 02:08AM

వైరస్‌ భయంతో తమ్ముడిని చంపిన అన్న

ముంబై, మార్చి 26: ఎంత చెప్పినా వినకుండా లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని ఓ అన్న సొంత తమ్ముడిని చంపేశాడు. ఈ ఘటన ముంబైలోని కాందీవలీ ప్రాంతంలో జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు దుర్గేశ్‌. పుణెలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా భయంతో ఇటీవలే ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక అతని అన్న రాజేశ్‌ ఠాకూర్‌, వదిన కోప్పడ్డారు. వైరస్‌ సోకితే తమకు కూడా వస్తుందని అనుమానించారు. అన్నదమ్ముల మధ్య ఘర్షణ పెరిగింది. ఈ క్రమంలో రాజేశ్‌ ఠాకూర్‌ తన తమ్ముడిని హత్య చేశాడు. పోలీసులు రాజేశ్‌ను అరెస్టు చేశారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement