రక్షాబంధన్: అక్కకు ప్రాణదానం చేసిన తమ్ముడు!

ABN , First Publish Date - 2021-08-21T13:55:25+05:30 IST

31 ఏళ్ల రియాకు గత కొన్నాళ్లుగా డయాలసిస్ జరుగుతోంది.

రక్షాబంధన్: అక్కకు ప్రాణదానం చేసిన తమ్ముడు!

న్యూఢిల్లీ: 31 ఏళ్ల రియాకు గత కొన్నాళ్లుగా డయాలసిస్ జరుగుతోంది. ఇటీవలే ఆమె కిడ్నీ ఫెయిల్ అయ్యింది. దీంతో ఆమెకు కిడ్నీ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఆమెకు అనువైన కిడ్నీ దొరకకపోవడంతో రియాతో పాటు కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగింది. అయితే రియా తమ్ముడు ఆమెకు కిడ్నీ దానమిచ్చి, ఆమె ప్రాణాలు కాపాడాడు. 


రాఖీకి ముందుగానే సోదరి విషయంలో తన బాధ్యతను నిలబెట్టుకుని పలువురికి స్ఫూర్తినిచ్చాడు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు మాట్లాడుతూ రియాకు కొత్త జీవితం లభించిందని, ఇకపై ఆమె అందరి మాదిరిగానే జీవితం గడలపగలుగుతుందన్నారు. హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన రియా గత నెలలో ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేశారు. ఆ తరువాత ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుప్రత్రిలోని నెఫ్రాలజీ విభాగపు వైద్యులు డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ బాధితురాలి భర్త కిడ్నీ దానమిచ్చేందుకు ముందు వచ్చినా అది మ్యాచ్ కాలేదన్నారు. అయితే ఆమె సోదరుడు కిడ్నీ ఇవ్వడానికి ముందుక వచ్చాడని దీంతో రియాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయగలిగామన్నారు.

Updated Date - 2021-08-21T13:55:25+05:30 IST