క్రీడలతో సోదరభావం పెంపొందాలి

ABN , First Publish Date - 2022-02-27T05:20:45+05:30 IST

క్రీడలతో సోదరభావం వెల్లివిరియాలని మహబూబ్‌నగర్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి అన్నారు.

క్రీడలతో సోదరభావం పెంపొందాలి
వాలీబాల్‌ టోర్నీని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణమ్మ

- వాలీబాల్‌ టోర్ని  ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి


మూసాపేట, ఫిబ్రవరి 26 : క్రీడలతో సోదరభావం వెల్లివిరియాలని మహబూబ్‌నగర్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మూసాపేటలో ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ టోర్నీని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలు శరీర దారుఢ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడ్తాయన్నారు. వాలీబాల్‌ అంటేనే  మూసాపేట గుర్తుకు వస్తుందని అన్నారు.  ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా నలు మూలల నుంచి 46 జట్లు పాల్గొనడం సంతోషమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీ సీ ఇంద్రయ్యసాగర్‌, ఎంపీపీ గూపని కళావతి, ఎంపీడీవో ఉమాదేవి, తహసీ ల్దార్‌ మంజుల, టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొండ ప్రశాంత్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి హర్శవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి శేఖర్‌, నాయకులు భాస్కర్‌గౌడ్‌, మశ్చేందర్‌నాథ్‌, కొండయ్య, నేతాజీ యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శి బల్లే నవీన్‌కుమార్‌, జింకలి శేఖర్‌, వివిధ గ్రామాల క్రీడాకారులు, యువజన సంఘా ల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఇష్టంతో చదవాలి : జడ్పీ చైర్‌పర్సన్‌

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని మహబూబ్‌నగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఆమె తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల మేధాశక్తిని పరిశీలించారు. చదువుకుంటే సమాజంలో మంచి గుర్తింపుతో పాటు క్రమ శిక్షణ వస్తుందని ఆమె అన్నారు. 

Updated Date - 2022-02-27T05:20:45+05:30 IST