కరోనా వేళ కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఈ సోదరుల ఉపాయం ఇదీ..

ABN , First Publish Date - 2020-05-30T02:06:26+05:30 IST

ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టుకింద బార్బర్ షాప్ నడుపుతున్నారు.

కరోనా వేళ కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఈ సోదరుల ఉపాయం ఇదీ..

చండీగఢ్: ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టుకింద బార్బర్ షాప్ నడుపుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో తమ షాపును తెరవాలనుకున్నారు. అయితే అసలే కరోనా భయంతో వణికిపోతున్న ప్రజలు రోడ్డు పక్కనే ఉన్న తమ షాపుకు వస్తారా? అనే అనుమానం వారికి కలిగింది. అంతే ఓ కొత్త ఉపాయం వేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అదేంటంటే.. వీరిద్దరూ రెండు పీపీఈ కిట్టు కొనుగోలు చేసి, వాటిని ధరించి తమ పని చేస్తున్నారు. హరియాణాలోని పంచకూలకు చెందిన ఈ ఇద్దరు సోదరుల బార్బర్ షాప్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ‘మేం ఈ షాపును 20ఏళ్లుగా నడుపుతున్నాం. మా భద్రత, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పీపీఈ కిట్లు కొనుగోలు చేశాం. దీని వల్ల కస్టమర్లు కూడా తృప్తి పడతారు’ అని ఆ సోదరులంటున్నారు.

Updated Date - 2020-05-30T02:06:26+05:30 IST