హలో.. బ్రదర్స్‌!

ABN , First Publish Date - 2021-03-25T09:50:03+05:30 IST

ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో క్రునాల్‌ పాండ్యా 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేశాడు. దాంతో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు సోదరుల ద్వయం రెండు జట్ల తరపున బరిలోకి దిగడం క్రికెట్‌ చరిత్రలో నాలుగోసారిగా...

హలో.. బ్రదర్స్‌!

ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో క్రునాల్‌ పాండ్యా 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేశాడు. దాంతో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు సోదరుల ద్వయం రెండు జట్ల తరపున బరిలోకి దిగడం క్రికెట్‌ చరిత్రలో నాలుగోసారిగా నమోదైంది. భారత్‌ తరపున 30 ఏళ్ల క్రునాల్‌తోపాటు అతడి సోదరుడు హార్దిక్‌ (27), ఇంగ్లండ్‌ తరపున కర్రాన్‌ సోదరులు టామ్‌ (26), శామ్‌ (22) ఆడారు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ కేవలం ఒక పరుగుకే అవుట్‌కాగా..క్రునాల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులు చేసిన అతడు కెరీర్‌లో మొదటి వన్డేను మరపురానిదిగా చేసుకున్నాడు. అంతేకాదు 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా అరంగేట్ర మ్యాచ్‌లో అతి తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన క్రికెటర్‌గా క్రునాల్‌ రికార్డు నెలకొల్పడం విశేషం. అలాగే వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ స్ట్రయిక్‌ రేట్‌ (187.09)తో మరో రికార్డునూ అతడు తన పేరిట నమోదు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో కర్రాన్‌ సోదరులు వికెట్లేమీ తీయలేకపోయారు. ఇంగ్లండ్‌ ఛేదనలో క్రునాల్‌ ఒక వికెట్‌ పడగొట్టగా, హార్దిక్‌ బౌలింగ్‌ చేయలేదు. శామ్‌ 12 రన్స్‌ చేయగా, టామ్‌ 11 పరుగులు సాధించాడు. 251 పరుగులకు ఆలౌట్‌ అయిన ఇంగ్లండ్‌ 66 రన్స్‌తో ఓటమి చవిచూసింది. 




గతంలో ‘బ్రదర్స్‌’ ఎవరెవరంటే..

గతంలోనూ అంతర్జాతీయ క్రికెట్‌ పలువురు సోదరుల ద్వయాలు ఒకే మ్యాచ్‌లో ఆడాయి. వారిలో అమర్‌నాథ్‌, పఠాన్‌ (భారత్‌), చాపెల్‌, వా, హస్సీ, మార్ష్‌ (ఆస్ట్రేలియా), ఫ్లవర్‌ (జింబాబ్వే), మహ్మద్‌, అక్మల్‌ (పాకిస్థాన్‌) బ్రదర్స్‌ ఉన్నారు. దిగ్గజ ఆటగాడు లాలా అమర్‌నాథ్‌ కుమారులు సురీందర్‌/మొహిందర్‌ అమర్‌నాథ్‌-పాకిస్థాన్‌కు సాదిక్‌ మహ్మద్‌/ముస్తాక్‌ మహ్మద్‌ ఒకే వన్డేలో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలుపొందింది. 




మార్క్‌/స్టీవ్‌ వా-ఆండీ/గ్రాంట్‌ ఫ్లవర్‌

1990-2000లో ఆస్ట్రేలియా క్రికెట్‌ సూపర్‌ పవర్‌గా నిలవడంలో వా సోదరుల పాత్ర అనన్య సామాన్యం. వికెట్‌ కీపర్‌ ఆండీ ఫ్లవర్‌ ఉపయుక్తకర బ్యాట్స్‌మన్‌కాగా, అతడి తమ్ముడు గ్రాంట్‌ ఫ్లవర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, లెఫ్టామ్‌ స్పిన్నర్‌. అటు వా-ఇటు ఫ్లవర్‌ సోదరులు 10 వన్డేలలో ఒకరిపై ఒకరు ఆడారు. 


కమ్రాన్‌/ఉమర్‌ అక్మల్‌-మైకేల్‌/డేవిడ్‌ హస్సీ

రెండు వన్డేలలో కమ్రాన్‌/ఉమర్‌ అక్మల్‌-మైకేల్‌/డేవిడ్‌ హస్సీ ఒకరిపై ఒకరు ఆడారు. షార్జాలో జరిగిన తొలి పోరులో ఆసీస్‌ 4 వికెట్లతో నెగ్గింది. ఇక  అబుదాబిలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్లతో కంగారూలను పాకిస్థాన్‌ చిత్తుచేసింది. 
















వన్డేల్లో బ్రదర్స్‌ 



Updated Date - 2021-03-25T09:50:03+05:30 IST