గిరిజన చట్టాల అమల్లో పాలకులు విఫలం: బృందాకరత్‌

ABN , First Publish Date - 2021-01-26T05:41:55+05:30 IST

ఆదివాసీ చట్టాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభభ్యురాలు బృందకరత్‌ అన్నారు.

గిరిజన చట్టాల అమల్లో పాలకులు విఫలం: బృందాకరత్‌
ఆదివాసీ గిరిజనులకు నిత్యావసరాలు అందిస్తున్న బృందాకరత్‌

ఏన్కూరు, జనవరి 25: ఆదివాసీ చట్టాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభభ్యురాలు బృందకరత్‌ అన్నారు. సోమవారం కొత్తగూడెం వెళుతూ ఏన్కూరులో ఆగి పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. పోడుభూములపై హక్కులు కలిపించాల్సిందిపోయి ప్లాంటేషన్‌ పేరుతో పోడుభూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈసందర్భంగా కొత్తమేడేపల్లి గిరిజనులు తమ సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందించారు. అనంతరం నిత్యావసరాలు అందించారు. ఈకార్యక్రమంలో భూక్యా వీరభద్రంనాయక్‌, దొంతబోయిన నాగేశ్వరరావు, బాలాజీనాయక్‌, లక్ష్మానాయక్‌, గుడ్ల వెంకటేశ్వర్లు, కిషన్‌రావు, బానోతు అమల, ఎం.పద్మ, వేల్పుల రాములు, పాల్గొన్నారు


Updated Date - 2021-01-26T05:41:55+05:30 IST