Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కడి గోడలపై భార్యల ఫొటోలు.. పక్కన వేరొకరి ఫొటో.. ప్రతీ వెయ్యి మందిలో 700 మందికి కార్లు..

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ వింతలు, విచిత్రాలు కనిపిస్తుంటాయి. అయితే ఆ దేశంలో కొనసాగే ఆచారాలు,  సంప్రదాయాలు మిగిలిన దేశాల కన్నా భిన్నంగా ఉంటాయి. అది ఒక ముస్లిం దేశం. ఆ దేశం గురించి తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు. ముస్లిం దేశమైన బ్రూనైలో ఈ నాటికీ విచిత్రమైన సంప్రదాయాలు కనిస్తాయి. అవి నమ్మశక్యంగా అనిపించకపోయినప్పటికీ అక్కడ కనిపించే వాస్తవమదే.. 

ప్రపంచంలోని ధనిక దేశాలలో బ్రూనై కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణంగా సంపన్న దేశాలలోని ప్రజలు తమ  కుటుంబం కోసం విలాసవంతమైన బంగ్లాలు నిర్మించుకుంటారు. అలాగే ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి, వాటిలో తిరుగుతుంటారు. అయితే బ్రూనై ప్రజల ఆలోచనలు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. బ్రూనై ప్రజల తీరు తెన్నుల గురించి తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.. ఇక్కడి ప్రజలు విలాసవంతమైన ఇళ్ల కంటే ఖరీదైన వాహనాలపైనే మోజు చూపిస్తారు. వీలైనన్ని కార్లను కొనుగోలు చేయాలని తపనపడుతుంటారు. ఫలితంగా ఈ దేశంలో ఇళ్ల కంటే కార్ల సంఖ్యే అధికంగా ఉంటుంది. బ్రూనైలో ఇప్పటికీ రాజరిక పాలన కొనసాగుతోంది. ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగానే బ్రూనై కూడా బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. 1984 జనవరి 1న బ్రూనై స్వాతంత్ర్యాన్ని పొందింది.

ఈ దేశంలో ప్రతీ ఇంటి గోడలపై ఆ ఇంటి యజమాని భార్య ఫోటో ఉంటుంది. పక్కన బ్రూనై సుల్తాన్ ఫోటో ఉంటుంది. ఇక్కడి ప్రజల ఆహార అభిరుచులు మిగతా దేశాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఫలితంగా ఇక్కడ అతి తక్కువ సంఖ్యలోనే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు ఉంటాయి. బ్రూనైలో ప్రతీ 1000 మందిలో 700 మందికి కార్లు ఉన్నాయని ఒక నివేదికలో వెల్లడయ్యింది. ఇక్కడ చమురు ధర చాలా తక్కువ. రవాణా పన్ను కూడా చాలా స్వల్పం. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement