Abn logo
Jan 25 2021 @ 09:30AM

నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

నల్లగొండ : పట్టణంలోని రాంనగర్ లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఇతర రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారు ఏ రాష్ట్రం వారు అనేది తెలియాలిసి ఉంది. ఈ ఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించింది. 

Advertisement
Advertisement
Advertisement