Abn logo
Aug 26 2021 @ 21:49PM

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అమిత్ అనే యువకుడి తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఆపై పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. ఈ ఘటన హైదర్ ఎంక్లేవ్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.