ఎన్‌ఎస్‌ఈ బాటలో బీఎస్‌ఈ

ABN , First Publish Date - 2020-11-26T08:16:59+05:30 IST

కార్వీస్టాక్‌ బ్రోకరేజీ సభ్యత్వాన్ని బీఎస్‌ఈ రద్దు చేసింది. ఇది మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. కార్వీ నీ ఎగవేతదారుగా ప్రకటించి సభ్యత్వాన్ని ఎన్‌ఎ్‌సఈ రద్దు చేసిన వెంటనే బీఎ స్‌ఈ కూడా నిర్ణయం తీసుకుంది

ఎన్‌ఎస్‌ఈ బాటలో బీఎస్‌ఈ

కార్వీ సభ్యత్వం రద్దు ఐపీఎఫ్‌ ద్వారా బకాయిల చెల్లింపు


హైదాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కార్వీస్టాక్‌ బ్రోకరేజీ సభ్యత్వాన్ని బీఎస్‌ఈ రద్దు చేసింది. ఇది మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. కార్వీ నీ ఎగవేతదారుగా ప్రకటించి సభ్యత్వాన్ని ఎన్‌ఎ్‌సఈ రద్దు చేసిన వెంటనే బీఎ స్‌ఈ కూడా నిర్ణయం తీసుకుంది. ఎంసీఎక్స్‌లో కార్వీకి కమోడిటీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఉందని దీన్ని కూడా రద్దు చేసే వీలుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సభ్యత్వాన్ని రద్దు చేసినందున కార్వీ నుంచి బకాయిలు రావాల్సిన ఇన్వెస్టర్లు బకాయిల కోసం నోటీసు జారీ చేసిన నాటి నుంచి 90 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని బీఎ్‌సఈ కోరింది. బ్రోకింగ్‌  సభ్యుడు డీఫాల్ట్‌ అయితే.. ఇన్వెస్టర్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ (ఐపీఎఫ్‌) నుంచి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఆ బకాయిలను చెల్లిస్తాయి.


బకాయిలు క్లైయిమ్‌ చేసుకోవడానికి త్వరలో ఎన్‌ఎ్‌సఈ ప్రకటన ఇవ్వవచ్చని, కొన్ని నిబంధనల మేరకు కార్వీ ఖాతాదారులు ఎక్స్ఛేంజీకి చెందిన మదుపర్ల రక్షణ నిధి నుంచి రూ.25 లక్షల వరకూ పొందడానికి అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కార్వీకి గత ఏడాది (2019) చివరి నాటికి దాదాపు 3.3 లక్షల మంది క్లయింట్లు ఉన్నారు. సెబీ ఆదేశానికి అనుగుణంగా దాదాపు 2.3 లక్షల మంది ఖాతాదారుల షేర్లను డిసెంబరు నాటికి వెనక్కి చెల్లించారు. కార్వీ మార్కెట్‌ ఆస్తులను విక్రయించడం ద్వారా మిగిలిన వారిలో కొంతమందికి ఎన్‌ఎ్‌సఈ చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 2,35,000 ఖాతాదారులకు చెందిన రూ.2,000 కోట్లకు పైగా బకాయిలు, షేర్లను ఎన్‌ఎ్‌సఈ తిరిగి చెల్లించినట్లు చెబుతున్నారు. రూ.800 కోట్ల వరకూ డీఫాల్ట్‌ అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-11-26T08:16:59+05:30 IST