బుల్‌ జోష్‌

ABN , First Publish Date - 2020-04-08T07:48:35+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు లాభం నమోదైంది. బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ ఏకంగా 2,476.26 పాయింట్లు (8.97 శాతం) పెరిగి 30,067.21 వద్దకు చేరుకుంది.

బుల్‌ జోష్‌

ఆల్‌టైమ్‌  రికార్డు లాభం 

సెన్సెక్స్‌ 2,476 పాయింట్లు అప్‌ 

మళ్లీ 30 వేల ఎగువకు సూచీ 

708 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ 

రూ.7.71 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు లాభం నమోదైంది. బీఎ్‌సఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ ఏకంగా 2,476.26 పాయింట్లు (8.97 శాతం) పెరిగి 30,067.21 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎ్‌సఈలోని నిఫ్టీ-50 సూచీ సైతం 708.40 పాయింట్లు  (8.76 శాతం) పుంజుకొని 8,792.20 వద్ద స్థిరపడింది.


పాయింట్ల పరంగా చూస్తే.. సూచీల చరిత్రలో ఇదే అతిపెద్ద లాభం. పెరుగుదల శాతం ప్రకారంగా చూస్తే.. 2009 మే తర్వాత ఇదే అతిపెద్ద వృద్ధి. అమెరికా తదితర దేశాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ప్రపంచ మార్కెట్లలో సానుకూలతను పెంచాయి. దాంతో గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లతోపాటు దేశీయ సూచీలూ ర్యాలీ తీశాయి. 


బ్లూచి్‌పలతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీలకూ కొనుగోళ్ల ఆదరణ లభించింది. దాంతో బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సూచీ 4.13 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 5.40 శాతం బలపడ్డాయి. 


భారీ ర్యాలీలో మార్కెట్‌ వర్గాల సంపద రూ.7.71 లక్షల కోట్లు పెరిగింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,16,38,099.98 కోట్లకు చేరుకుంది. 


సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీలూ లాభపడ్డాయి. అందులో 14 కంపెనీలు 10 శాతానికి పైగా పుంజుకున్నాయి. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ ఏకంగా 22.60 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. 


సెన్సెక్స్‌ ర్యాలీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌లదే ప్రధాన వాటా. ఆర్‌ఐఎల్‌ షేరు 11.89 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 10.18 శాతం బలపడ్డాయి. 


బుల్స్‌ జోరులో 26 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని చేరుకోగా.. 428 సంస్థల షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. 


బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలు పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. బ్యాంకింగ్‌, ఇంధన రంగ సూచీలైతే 10 శాతం పైగా వృద్ధి చెందాయి. టెలికాం, ఆటో 9 శాతానికి పైగా లాభపడ్డాయి.


రూపాయి

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 49 పైసలు బలపడి 75.64 వద్ద ముగిసింది. స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ ఇందుకు దోహదపడింది. 


ఎంఎఫ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ వేళల్లో మార్పులు

మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘స్టార్‌-ఎంఎ్‌ఫ’లో ఫండ్‌ పథకాల సబ్‌స్ర్కిప్షన్‌, రిడంప్షన్‌ లావాదేవీలకు అనుమతించే సమయాన్ని తగ్గిస్తున్నట్లు బీఎ్‌సఈ తెలిపింది. ఈ నెల 7 వ తేదీ (మంగళవారం) నుంచి సవరించిన వేళలు అమల్లోకి వచ్చాయి.  


బంగారం

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం రేటు 1708 డాలర్లకు చేరుకోగా.. వెండి 15.67 డాలర్ల వద్ద ట్రేడైంది. లాక్‌డౌన్‌ కారణంగా దేశం లోని అన్ని నగరాల్లో బులియన్‌ స్పాట్‌ ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఇండియన్‌ బు లియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. మంగళవారం ఆరం భంలో ముంబై మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.45,121 వద్ద ట్రేడయి చివరకు రూ.44,480 వద్ద క్లోజైంది.


సెన్సెక్స్‌ టాప్‌-10 గెయిన్స్‌ (పాయింట్లలో)

లాభం తేదీ    

2,476.26 2020 ఏప్రిల్‌ 07

2,110.79 2009 మే 18

1,921.15 2019 సెప్టెంబరు 20

1,861.75 2020 మార్చి 25 

1,627.73 2020 మార్చి 20

1,421.90 2019 మే 20

1,325.34 2020 మార్చి 13

1,139.92 2008 జనవరి 25

1,075.41 2019 సెప్టెంబరు 23

928.09 2008 మార్చి 25  

Updated Date - 2020-04-08T07:48:35+05:30 IST