టెర్రరిస్టుల సొరంగం.. పాక్ నుంచి భారత్‌లోకి!

ABN , First Publish Date - 2020-11-23T04:37:06+05:30 IST

జమ్మూలోని సాంబా జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ సొరంగాన్ని గుర్తించారు. టెర్రరిస్టులు తమ అక్రమ కార్యకలాపాల కోసమే ...

టెర్రరిస్టుల సొరంగం.. పాక్ నుంచి భారత్‌లోకి!

శ్రీనగర్: జమ్మూలోని సాంబా జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ సొరంగాన్ని గుర్తించారు. టెర్రరిస్టులు తమ అక్రమ కార్యకలాపాల కోసమే ఈ సొరంగాన్ని నిర్మించి ఉంటారని వారు చెబుతున్నారు. భారత్‌లోకి రహస్యంగా ప్రవేశించేందుకు, అక్రమంగా ఆయుధాలను భారత్‌లోకి తీసుకొచ్చేందుకే టెర్రరిస్టులు ఈ సొరంగాన్ని వినియోగించి ఉంటారని, ఈ సొరంగం అవతలి వైపు పాక్ వరకు ఉండవచ్చని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు. ఈ సొరంగాన్ని గమనిస్తే నిపుణులైన ఇంజనీర్ల ద్వారా నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. దీనిని బట్టి చూస్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు శత్రువులు ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడరని మరోసారి రుజువైందని బీఎస్ఎఫ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2020-11-23T04:37:06+05:30 IST