Abn logo
Aug 13 2020 @ 05:45AM

చెనాబ్ నదిలో పడవలపై బీఎస్ఎఫ్ జవాన్ల పెట్రోలింగ్

అఖ్నూర్ (జమ్మూకశ్మీర్): భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి అక్రమంగా చొరబడకుండా నివారించేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు సరిహద్దుల్లోని చెనాబ్ నదిలో పడవలపై నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారు. అత్యంత అధునాతన పడవల్లో బీఎస్ఎఫ్ జవాన్లు 24 గంటల పాటు నదిలో తిరుగుతూ పాక్ సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 15వతేదీన 74వ స్వాతంత్ర్యదినోత్సవం జరగనున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సరిహద్దుల్లో అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో సైనికుల పహరాను ముమ్మరం చేశారు. పుల్వామా జిల్లాలోని కంరాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు బుధవారం ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ మరణించగా, మరో జవాన్ జులాజిత్ యాదవ్ బుల్లెట్ గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement