Pakistan borderలో డ్రోన్ చొరబాటు యత్నం...బీఎస్ఎఫ్ కాల్పులు

ABN , First Publish Date - 2021-12-20T16:48:43+05:30 IST

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్ చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు అడ్డుకున్న ఘటన...

Pakistan borderలో డ్రోన్ చొరబాటు యత్నం...బీఎస్ఎఫ్ కాల్పులు

గురుదాస్‌పూర్‌ (పంజాబ్): పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్ చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు అడ్డుకున్న ఘటన ఆదివారం రాత్రి జరిగింది.గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని కసోవాల్ సరిహద్దు ఔట్‌పోస్ట్‌ సమీపంలో పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్ ఎగురుతుండగా, అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల తర్వాత డ్రోన్ పాకిస్థాన్ సరిహద్దు వైపు తిరిగి వెళ్లింది.డ్రోన్ ఎగిరిన సరిహద్దు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.మరోవైపు పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని డేరా బాబా నానక్ ప్రాంతంలో అక్రమంగా చొరబడిన పాకిస్థాన్ యువకుడు పట్టుబడ్డాడు.పాక్ యువకుడి నుంచి మొబైల్ ఫోన్, పాకిస్థాన్ కరెన్సీని బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.అంతకుముందు, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో గత శుక్రవారం రాత్రి భద్రతా దళాలు డ్రోన్‌ను కూల్చివేశాయి. 

Updated Date - 2021-12-20T16:48:43+05:30 IST