BSF troops : పాక్ చొరబాటుదార్ల కాల్చివేత

ABN , First Publish Date - 2021-07-31T18:47:45+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ సరిహద్దుల్లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం...

BSF troops : పాక్ చొరబాటుదార్ల కాల్చివేత

ఫిరోజ్‌పూర్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ సరిహద్దుల్లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్చిచంపింది.ఫిరోజ్‌పూర్ సరిహద్దుల మీదుగా పాకిస్థాన్ దేశం నుంచి ఇద్దరు వ్యక్తులు భారతదేశంలోకి చొరబడేందుకు శుక్రవారం రాత్రి యత్నించారు. చొరబాటుదారులను గమనించిన భారత భద్రతా దళాలు ఆగిపోమ్మని పదేపదే హెచ్చరికలు చేసింది. బీఎస్ఎఫ్ బలగాల హెచ్చరికలను పట్టించుకోకుండా సరిహద్దుల్లో కంచె దాటి భారతదేశంలోకి వచ్చారు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు. 


చొరబాటుదారుల మృతదేహాలను స్వాధీనం చేసుకొని వారిని గుర్తించడానికి బీఎస్ఎఫ్ దర్యాప్తు సాగిస్తోంది.దాదాపు ఒక నెలరోజుల క్రితం సరిహద్దు ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) పాకిస్తాన్ చొరబాటుదారుడిని కాల్చివేసింది. మృతుడి నుంచి దాదాపు 27 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.


Updated Date - 2021-07-31T18:47:45+05:30 IST