Abn logo
May 25 2020 @ 21:24PM

బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ యూజర్లకు గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వేళ వర్క్ ఫ్రం హోం చేస్తున్న తమ ల్యాండ్‌లైన్ ఖాతాదారులకు బీఎస్ఎన్ఎల్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘వర్క్ ఫ్రం హోం’ ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. నెల రోజుల ప్రమోషనల్ ప్లాన్‌లో భాగంగా మార్చిలో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ఆ తర్వాత దీనిని మే 19 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోమారు జూన్ 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేని బీఎస్‌ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ‘వర్క్ ఫ్రం హోం’ను ప్రోత్సహించేందుకు దీనిని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. 


ఈ ప్లాన్‌లో ఖాతాదారులకు 10 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగం 5జీబీ వరకు లభిస్తుంది. ఆ తర్వాత వేగం 1 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అలాగే ఒక ఈ-మెయిల్ ఐడీ 1జీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి ఇన్‌స్టాలేషన్ చార్జీలు కానీ, సెక్యూరిటీ డిపాజిట్లు కానీ ఉండవు. అయితే, ఈ ప్లాన్‌ను ఉచితంగా పొందేందుకు సొంత మోడెమ్ కానీ, ప్రెమిస్ ఎక్విప్‌మెంట్ (సీపీఈ) కానీ కలిగి ఉండాలి. 


Advertisement
Advertisement
Advertisement