రోజుకు 5జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ నయా ‘వర్క్ ఫ్రం హోం ప్లాన్’

ABN , First Publish Date - 2020-07-07T01:44:18+05:30 IST

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం 90 రోజుల కాలపరిమితితో

రోజుకు 5జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ నయా ‘వర్క్ ఫ్రం హోం ప్లాన్’

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం 90 రోజుల కాలపరిమితితో ‘వర్క్ ఫ్రం హోం’ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అపరిమిత కాల్స్, రోజుకు 5జీబీ డేటా, రోమింగ్, ఎస్టీడీ కాల్స్ లభించే ఈ ప్లాన్ విలువ రూ. 599 మాత్రమే. అయితే, ఈ ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. డేటా వేగం 80 కేబీపీఎస్ కాగా, అపరిమిత కాల్స్ రోజుకు 250 నిమిషాలకు పరిమితం చేసింది. అలాగే, ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు  ‘STV COMBO599’ అని టైప్ చేసి 123 నంబరుకు బీఎస్ఎన్ఎల్ నంబరు నుంచి ఎస్సెమ్మెస్ పంపించాల్సి ఉంటుంది. అలాగే, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను పొందొచ్చు.   

Updated Date - 2020-07-07T01:44:18+05:30 IST